Akhil: ఆ పాత్రలో అఖిల్.. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకుంటారా?

అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉండగా అఖిల్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉంది. తర్వాత సినిమాలతో అఖిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. తారకసింహారెడ్డి పాత్రలో అఖిల్ తర్వాత సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. అఖిల్ గత సినిమా ఏజెంట్ భారీ అంచనాలతో విడుదలైనా ఆ అంచనాలను అందుకోలేదు. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం. అఖిల్ కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది. అఖిల్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా మహారాష్ట్ర ఫారెస్ట్ లో ప్రస్తుతం షూట్ జరుగుతోందని తెలుస్తోంది.

అఖిల్ (Akhil) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయేమో చూడాల్సి ఉంది. సినీ ప్రముఖులు సైతం అఖిల్ టాలెంట్ కు తగిన హిట్లు రావాలని కోరుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రం అఖిల్ కు కెరీర్ పరంగా తిర్గుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus