అఖిల్ విన్యాసాలు మామూలుగా లేవు… ఫోటోలు వైరల్..!

  • February 2, 2021 / 03:15 PM IST

ఏ ముహూర్తాన కాజల్ అగర్వాల్ తన పెళ్ళైన వెంటనే భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల ట్రిప్ కు వెళ్లిందో కానీ.. అప్పటి నుండీ ఎవరో ఒకరు టాలీవుడ్ నుండీ మాల్దీవుల్లో సందడి చేస్తూనే ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత,దిశా పఠాని వంటి భామలతో పాటు మొన్నటికి మొన్న అక్కినేని నాగ చైతన్య- సమంత అలాగే మంచు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అక్కడ మెరిశారు. తాజాగా ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా మాల్దీవుల్లో మెరిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అఖిల్ విన్యాసాలకు నెటిజన్లు సైతం వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోని కూడా పోస్ట్ చేసాడు అఖిల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తోన్న అఖిల్.. అటు తరువాత సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని ఈ సమ్మర్ కు విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక మార్చి నుండీ అఖిల్ -సురేంద్ర రెడ్డి ల ప్రాజెక్టు మొదలుకాబోతుందని కూడా టాక్ నడుస్తుంది.ఈ చిత్రాన్ని ‘ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇది ఒక డిఫరెంట్ టెక్నికల్ థ్రిల్లర్ అట. ఈ చిత్రానికి 60కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని కూడా తెలుస్తుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అఖిల్.. మాల్దీవుల ట్రిప్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus