అక్కినేని ఫ్యామిలీ చిత్రం “మనం”లో అఖిల్ కాసేపు కనిపించినా ఎంట్రీ మాత్రం అదిరి పోయింది. దీంతో హీరోగా అతని మొదటి చిత్రం “అఖిల్” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేక పోయింది. తనయుడి తొలి చిత్రం ఫెయిల్ కావడంతో కింగ్ నాగార్జున రంగంలోకి దిగి, తమ కుటుంబనాయికి బిగ్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో అఖిల్ మూవీ చేసేలా సెట్ చేశాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ఫిల్మ్ఈ గురించి తాజా వార్త బయటికి వచ్చింది.
ఇందులో అక్కినేని ప్రిన్స్ సరసన జెంటిల్ మ్యాన్ భామ నివేతా థామస్ నటించనున్నట్లు తెలిసింది. నేచురల్ స్టార్ నాని తో కేరళ కుట్టి పోటీ పడి నటించి తొలి చిత్రంతోనే అందరినీ తన వైపు తిప్పుకుంది. ఆఫర్లు వెల్లువెత్తినా స్కిన్ షో కి తాను దూరమంటూ స్పష్టంగా చెప్పి పెద్ద అవకాశాలను సైతం వదులుకుంది. అయితే చక్కని చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీలో హీరోయిన్ పాత్ర బాగా నచ్చడంతో నివేత ఒకే చెప్పినట్లు సమాచారం.