Akhil, ANR : అఖిల్ పదేళ్లుగా దాచుకున్న ఫోటో ఇదే!

అక్కినేని అఖిల్ కి తన తాతగారంటే ఎంతో అభిమానం. అందుకే తన ఫోన్ వాల్ పేపర్ పై తాతగారి ఫోటో పెట్టుకొని రోజూ ఆయన్ను చూస్తూ ఉంటాడట. తన ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఫోటో ఇదేనంటూ అక్కినేని నాగేశ్వరావు ఫోటో చూపించారు. పదేళ్ల నుంచి ఇదే ఫోటో చూస్తున్నానని.. తన తాతగారికి సంబంధించి ఇష్టమైన స్టిల్ అంటూ చెప్పుకొచ్చారు. ఏ ఫోన్ మారినా.. ఈ లాక్ స్క్రీన్ మాత్రం అలానే ఉంటుందని అన్నారు.

తాతయ్యను ఆడిషన్ చేసినప్పుడు లుక్ టెస్ట్ కోసం తీసిన ఫోటో అని.. ఎందుకో బాగా నచ్చేసి.. పదేళ్ల నుంచి అలా ఉంచేసుకున్నా అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇక తన తండ్రికి ఉన్న మన్మథుడు ట్యాగ్ లైన్ పై స్పందిస్తూ.. ఎన్నేళ్లయినా అది తన తండ్రికే ఉంటుందని.. ఆ ట్యాగ్ లైన్ తనకు వద్దంటున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ హీరో.. సినిమాలో కామెడీ చేయలేదని..

తనపై కామెడీ నడుస్తుందని అన్నారు. సినిమాలో పూజాహెగ్డే కామెడీ చేస్తుందని.. ఆమె పాత్ర చాలా పెద్దదని.. ఆమె కెరీర్ లో మంచి క్యారెక్టర్స్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమా తరువాత గీతాఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు అఖిల్.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus