బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఏడోవారం నామినేషన్స్ హోరెత్తిపోయాయి. నువ్వా నేనా అంటూ మాటలు విసురుకున్నారు హౌస్ మేట్స్. బిగ్ బాస్ ఇద్దరిద్దరిని సెలక్ట్ చేసి వాళ్లు ఎందుకు నామినేట్ అవ్వాలో మాట్లాడుకోమని, నామినేట్ అవ్వాలి అనుకున్నవాళ్లు ఛైర్ పైన కూర్చోవాలి అని చెప్పాడు. ఛైర్ పైన కూర్చున్న వాళ్లకి బురనీటి స్నానం ఉంటుంది. ఇలా నామినేట్ అయ్యేటపుడు ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోతే ఇద్దరూ నామినేట్ అవుతారు.
ఇక్కడే బిందు మాధవి ఇంకా అఖిల్ ఇద్దరినీ పెట్టాడు బిగ్ బాస్. గతవారం నుంచీ ఇద్దరి మద్యలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇక ఎవ్వరూ తగ్గనంటే తగ్గనంటూ వాదించుకున్నారు. అరేయ్ అఖిల్ వెళ్లరా అంటూ బిందు మాధవి మాట్లాడితే, ఒసేయ్ బిందు వినవే నువ్వే నామినేట్ అవ్వవే అంటూ అఖిల్ మాట్లాడాడు. ఇద్దరూ మాటలతో రెచ్చిపోయారు. ఇక్కడ బిందు మాధవి ఎలిమినేట్ అయిన స్రవంతి టాపిక్ ని తీస్కుని వచ్చింది.
ఇంతవరకూ నువ్వు సోలో గేమ్ ఆడలేదని, గ్రూప్ గేమ్ ఆడావని చెప్పింది బిందు. అంతేకాదు, స్రవంతి ఫ్రెండ్షిప్ ని వాడుకున్నావని, ఎమోషన్ ని యూజ్ చేస్కున్నావంటూ పెద్ద నిందే వేసింది. అఖిల్ అసలు మద్యలో ఎలిమినేట్ అయిపోయిన స్రవంతి టాపిక్ ఎందుకు అని, నాకంటే నువ్వు ఎందులో బెటరో ప్రూవ్ చేయమని అన్నాడు. అసలు స్రవంతి నాకు ఎప్పుడూ కూడా హెల్ప్ చేయలేదని గుర్తు చేశాడు. అలాంటిది నేను ఎందుకు ఆమెని ఎమోషనల్ గా వాడుకున్నానో చెప్పమని డిమాండ్ చేశాడు.
కెప్టెన్సీ టాస్క్ అప్పుడు తనకి ఇస్తాని చెప్పి మళ్లీ ముమైత్ ఖాన్ మాటలకి ఇన్ఫులెన్స్ అయిపోయి మనసు మార్చుకున్నావంటూ బిందు మాధవి నిలదీసింది. అది నాగేమ్ నా ఇష్టమున్నట్లు ఆడుకుంటాను అంటూ చెప్పాడు అఖిల్. ఒకవేళ కెప్టెన్సీ వచ్చి ఉంటే స్రవంతి వెళ్లేది కాదని బిందు లాజికల్ గా మాట్లాడింది. ఇక్కడే అఖిల్ అసలు ఫస్ట్ నుంచీ స్రవంతిని ఎంకరేజ్ చేసిందే మా టీమ్ అంటూ గట్టి వాదన పెట్టుకున్నాడు.
ఈవాదనలోనే అరేయ్ అఖిల్.. వెళ్లరా.. వెళ్లి ఛైర్ పైన కూర్చోరా అంటూ బిందు మాధవి అఖిల్ ని టీజ్ చేసింది. అఖిల్ కూడా ఒసేయ్ బిందు నువ్వే వెళ్లవే అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు. వీరిద్దరూ ఇలా వాదించుకుంటుంటే హౌస్ మేట్స్ మాత్రం కూల్ గా ఎంజాయ్ చేశారు. వీరిద్దరి వాగ్వివాదంలో అషూరెడ్డి గేమ్ గురించి వచ్చినపుడు అషూరెడ్డి ఇన్వాల్ అయ్యింది. దీంతో బిందుమాధవి అషూ దగ్గరకి వెళ్లి మరీ కౌంటర్ వేసింది. వెళ్లి నామినేట్ అవ్వు మరి అంటూ మాట్లాడింది.
బిందు చేష్టలకి హౌస్ హీటెక్కిపోయింది. ఎక్కడా తగ్గకుండా అఖిల్ తో గట్టిగా వాదించింది. అఖిల్ కూడా లాజిక్ లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నావ్ అంటూ కన్ఫూజ్ అయిపోయాడు. స్రవంతి టాపిక్, నటరాజ్ మాస్టర్ టాపిక్, అషూరెడ్డి టాపిక్, ఇలా అఖిల్ కి సంబంధించినవి అన్నీ తీసుకుని వచ్చి రాంగ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ వాదించింది. అంతేకాదు, గ్రూప్ గా ఆడతారు, మళ్లీ మంచివాళ్లలా వాళ్లనే నామినేట్ చేస్తారు అంటూ బిందు మాధవి మొత్తుకుంది.
స్రవంతిని నువ్వే నామినేట్ చేశావ్ అంటూ గుర్తు చేసింది. ఇలా ఇద్దరూ హీటెడ్ ఆర్గ్యూమెంట్ తో హౌస్ వేడెక్కిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ ఛైర్ లో కూర్చోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ నామినేషన్స్ లోకి వచ్చారు.