బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ప్రారంభం అయ్యిందనగానే చాలామంది ఎన్నో అంచనాలని పెట్టుకున్నారు. హౌస్ లో ట్విస్ట్ లు ఉంటాయని, టాస్క్ లు కూడా ఒక రేంజ్ లో ఉంటాయని అనుకున్నారు. ఇక గ్లామరస్ గార్ల్స్ ని చూసి ఎన్నో ఊహించుకున్నారు. అదేం లేకుండా షో చప్పగా ఎప్పటిలాగానే సాగింది. అందుకే, మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరకి లైవ్ పైన ఇంట్రస్ట్ తెప్పించారు. దీంతో 4వ వారం నుంచీ షో గాడిలో పడింది.
ఇక్కడే హీరోయిన్ బిందు మాధవికి, అఖిల్ సార్ధక్ కి టఫ్ ఫైట్ ఎదురయ్యింది. లాస్ట్ టైమ్ సీజన్ 4 లో అభిజీత్ వర్సెస్ అఖిల్ ఎలాగైతే గొడవ పడేవారో, సేమ్ టు సేమ్ బిందుతో అఖిల్ కి క్లాష్ అయ్యింది. దీన్ని సరైన టైమ్ లో వాడుకుంది బిందు మాధవి. కేవలం అఖిల్ ని ఎదిరించడం, నామినేషన్స్ లో లాజిక్స్ వర్కౌట్ చేయడం వల్లే బిందు మాధవి ఇప్పుడు టైటిల్ రేస్ లో నిలబడింది. నిజానికి బిందు మాధవి తమిళ్ సీజన్ లో టాప్ రేస్ లో ఉంది.
హౌస్ మేట్స్ వ్యతిరేఖతని ఎదుర్కుని మిడ్ వీక్ ఓటింగ్ ద్వారా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు అదే సిట్యువేషన్ ఎక్కడ రిపీట్ అవుతుందో అనే ఫీలింగ్ లోనే ఉంది. అయితే, అఖిల్ తోనే కావాలనే గొడవలు పెట్టుకోవడం, పాయింట్ ఉన్నా లేకున్నా వాదించడం అనేది బిందు గేమ్ స్ట్రాటజీగానే చెప్పొచ్చు. ముందు నుంచీ కూడా టైటిల్ ఫేవరెట్ అయిన అఖిల్ తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్లాడు. కొన్ని సందర్భాల్లో బిందు చేసిన కామెంట్స్ , మాట్లాడిన మాటలకి అఖిల్ బరెస్ట్ కూడా అయ్యాడు.
ఇలా చేయడం వల్లే గేమ్ లో వెనకబడిపోయాడు. అంతేకాదు, టాస్క్ లు వచ్చినపుడు టాస్క్ లపైన దృష్టిపెట్టాడు. బిందుని బ్యాడ్ చేయాలని ఎక్కడా కూడా అనుకోలేదు. అలాగే, కావాలని టార్గెట్ కూడా చేయలేదు అఖిల్. బిందు మాధవికి ఫస్ట్ నుంచీ కూడా అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లోల హ్యూజ్ గానే ఓటింగ్ అనేది వచ్చింది. దీనికి కారణం ఆమె తమిళ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం, అఖిల్ సార్ధక్ కి వ్యతిరేకంగా వెళ్లడమే అని క్లియర్ గా చెప్పొచ్చు.
మొదటి వారం నుంచే అఖిల్ ని నామినేట్ చేస్తూ తన గేమ్ స్ట్రాటజీని క్లారిటీగా చెప్పింది. అందుకే ఇప్పుడు రేస్ లో ముందుకు దూసుకుపోతోంది. ఈవారం ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ నువ్వా – నేనా అన్నట్లుగా టైటిల్ పోరులో పోటీ పడుతున్నారు. ఇద్దరికీ ఆల్ మోస్ట్ ఒకేలాగా ఓటింగ్ అనేది జరుగుతోంది. ఇప్పుడు వీళ్లిద్దరిలో టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం.