బిగ్ బాస్ 4: అఖిల్ పట్టుదల…! మెహబూబ్ మొండితనం…!

  • November 11, 2020 / 11:24 AM IST

బిగ్ బాస్ హౌస్ లో రాకరాక వచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని మెహబూబ్ అండ్ అఖిల్ ఇద్దరూ కలిసి వదిలేసుకున్నారు. నువ్వు తగ్గు అంటే నువ్వు తగ్గు అంటూ వాగ్వివాదానికి పోయి టాస్క్ ని రద్దు చేసుకున్నారు. కెప్టెన్సీ పై నిర్లక్ష్యం , తోటి హౌస్ మేట్స్ గేమ్ పైన రెస్పెక్ట్ లేకపోవడం వల్ల బిగ్ బాస్ ఆఖరి బంతి అనే టాస్క్ ని రద్దు చేశాడు.

నిజానికి ఈ టాస్క్ లో ఎవరి బంతిని వాళ్లు పట్టుకోకూడదు. అంతేకాదు, ఎవరి బాల్ ని వాళ్లు బాస్కెట్ లోకి వేయకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్ గా చెప్పిన రూల్. కానీ లాస్ట్ లో అఖిల్, మెహబూబ్ ఇద్దరూ కూడా తమ బాల్స్ ని పట్టుకుని రెడీగా ఉండటంతో బిగ్ బాస్ చాలా ఆగ్రహంగా ఎనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో టాస్క్ అనేది రద్దు అయ్యింది.

సోహైల్, మెహబూబ్, అఖిల్ ముగ్గురూ కలికట్టుగా ఆడి ఈ టాస్క్ లో చివరివరకూ చేరారు. సోహైల్ శాక్రిఫైజ్ చేసిన తర్వాత అఖిల్ ఇంకా మెహబూబ్ లు మాత్రమే మిగిలారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చతంగా కెప్టెన్ అవుతారనే భావించారు మిగతా హౌస్ మేట్స్. కానీ ఇద్దరిమద్యలో బలమైన ఆర్గ్యూమెంట్ జరిగింది.

లాస్ట్ టైమ్ క్వాయిన్స్ టాస్క్ లో హెల్ప్ చేసినందుకు ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఇమ్మని అడిగాడు అఖిల్. అఖిల్ ఈవిషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. అలాగే, మెహబూబ్ నేను ఈవారం నామినేషన్స్ లో ఉన్నాను కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం అని నాకు కెప్టెన్సీ ఇస్తే పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుందని మెహబూబ్ వాదించాడు. ఇందులో అఖిల్ పట్టుదల, మెహబూబ్ మొండితనం కనిపించింది. దీంతో ఇద్దరికీ కాకుండా మద్యలో సోహైల్ కి లేకండా కెప్టెన్సీ అనేది ఈవారం పోయింది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus