‘మిస్టర్ మజ్ను’… ఇలా అయితే కష్టమే..!

అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘రిపబ్లిక్ డే’ సెలవు ఉండటం, లాంగ్ వీకెండ్ కావడంతో ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. మొదటి మూడు రోజులు ముగిసే సరికి ఈ చిత్రం 9.65 కోట్ల కలెక్షన్లను నమోదుచేసింది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు ఎగపడ్డారు. ఈ చిత్రానికి 24 కోట్ల వరకు ప్రీ -రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక మూడు రోజులకు గానూ ఈ చిత్ర ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.05 కోట్లు
వైజాగ్ – 0.98 కోట్లు
ఈస్ట్ – 0.50 కోట్లు


వెస్ట్ – 0.39 కోట్లు
కృష్ణా – 0.59 కోట్లు
గుంటూరు – 0.87 కోట్లు


నెల్లూరు – 0.26 కోట్లు
సీడెడ్ – 1.18 కోట్లు

———————————————–
తెలంగాణా + ఏపి = 7.82 కోట్లు
————————————————
యూఎస్ఏ – 0.50 కోట్లు
కర్నాటక – 0.98 కోట్లు
రెస్ట్ అఫ్


ఇండియా – 0.35 కోట్లు
————————————————
వరల్డ్ వైడ్
టోటల్ – 9.65 కోట్లు
————————————————

అఖిల్ గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు బాగా తక్కువనే చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ‘అఖిల్’ చిత్రం 16.34 కోట్లు, ‘హలో’ చిత్రం 10.6 కోట్ల కలెక్షన్లను నమోదు చేయగా… ‘మిస్టర్ మజ్ను’ మాత్రం 9.65 కోట్ల కలెక్షన్లను మాత్రమే నమోదు చేయడం గమనార్హం. సినిమా.. సినిమాకి అఖిల్ రేంజ్ తగ్గిపోతుండడం అక్కినేని అభిమానులని సైతం కలవరపెడుతుందనడంలో సందేహం లేదు. ఈరోజు బుకింగ్స్ చాలా స్లో గా ఉన్నాయనే చెప్పాలి … అందులోనూ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’ చిత్రానికి మరో 5 సీన్లు జతచేయడంతో… ‘మిస్టర్ మజ్ను’ కలెక్షన్ల పై ఒత్తిడి పడిందనే చెప్పాలి. ఈ క్రమంలో బయ్యర్ల ఆందోళన చెందుతున్నారు. ఫుల్ రన్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వారం మొత్తం హౌస్ ఫుల్స్ పడితే తప్ప ఈ చిత్రానికి లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఫుల్ రన్లో ‘మిస్టర్ మజ్ను’ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus