తండ్రి ఆశయాలను, ఆశలను నెరవేర్చడం కొడుకు బాధ్యత. తండ్రిలా బాధ్యతగా నడుచుకోవడం కూడా. దానికి చాలా బాధ్యతగా ఉండాలి. అప్పుడే తండ్రికి తగ్గ కొడుకు అని అంటారు. అకీరా నందన్ ఇప్పటికే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రిలా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందిన అకీరా… కరోనా సమయంలో ఆర్థులకు సాయం అందించి మంచి మనసుకున్న కుర్రాడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అకీరా వెనుక తల్లి రేణు దేశాయ్ ఉన్నారనేది తెలిసిన విషయమే.
తాజాగా రేణు దేశాయ్ తన కుమారుడి ఆలోచనల్ని తన సోషల్ మీడియా వేదికగా చూపించారు. అకీరా కొబ్బరి బొండాం తాగుతున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో గొప్పేమి ఉంది అని అడగొచ్చు. అకీరా ఆ ఫొటోల్లో చాలామందిలా స్ట్రాతో కొబ్బరిబొండా తాగడం లేదు. నేరుగా బొండాం తాగేస్తున్నాడు. అందులో ఏముంది అంటారా. ప్లాస్టిక్ వాడితే ప్రకృతికి అనర్థం అని పెద్దలు, సామాజిక వేత్తలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అకీరా చేసింది కూడా.
‘‘కొబ్బరిబోండాం తాగడానికి ఇదే బెస్ట్ వే. స్ట్రా లేదు, ప్లాస్టిక్ లేదు, ప్రకృతికి ఎలాంటి నష్టం లేదు’ అంటూ అకీరా ఫొటో పోస్ట్ చేసి రాసుకొచ్చారు రేణు దేశాయ్. దీంతోపాటు అదే పోస్ట్‌లో ఓ మహిళ గురించి కూడా రాసుకొచ్చారు రేణు దేశాయ్. ‘‘ఈషా ఫౌండేషన్ నుండి కోయింబత్తూర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ మహిళ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు.
ఆమె ఫొటో తీసుకున్న సమయంలో ‘మేం ఆనందంగా ఉండడానికి డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం లేదని’ చెప్పారు అని రాసుకొచ్చారు రేణు దేశాయ్. అలా ఒకే పోస్ట్‌లో ఇటు నో ప్లాస్టిక్ సందేశం, మరోవైపు మహిళా సాధికారతను చూపించారు రేణు దేశాయ్. ఏమాటకామాట. కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్న ఆ ఫొటోలో అకీరా.. అదిరిపోయాడు అని చెప్పొచ్చు. కళ్లలో ఆ షార్ప్‌నెస్.. పవన్ కల్యాణ్‌ను తలపించింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!