Akira Nandan: వైరల్ అవుతోన్న అకీరా లేటెస్ట్ పోస్ట్..!

  • July 17, 2023 / 02:42 PM IST

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఆయనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఎందుకంటే ఆయనను ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తారు. ఇక పవన్ తన రెండో భార్య రేణు దేశాయ్ తో విడిపోయినా కూడా వదినా అంటూ ఆమెకు చాలా మంది మెసేజ్ లు పెడుతూ ఉంటారు. ఇక ఎక్కవగా పవన్ కుమారుడు అకీరా గురించి కూడా అడుగుతూ ఉంటారు.

ఇక అకీరా (Akira Nandan) ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై పవన్ కానీ రేణు దేశాయ్ కానీ స్పందించడం లేదు. అయితే అప్పుడప్పుడు రేణు తన ముద్దుల కుమారుడు అకీరా విశేషాలను మాత్రం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని సార్లు ఫోటోలు షేర్ చేయడం మరి కొన్ని సార్లు కుమారుడు సాధించిన ఘనతలను పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఫోటోలను ఆమె షేర్ చేశారు. అందులో రేణు చాలా అందంగా కనపడింది.

అయితే అవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడిఫై చేసిన ఫోటోలు కావడం విశేషం. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను కూడా కొందరు అలానే చేశారు. అయితే ఇప్పుడు అకీరా కూడా తన తల్లి ఫోటోలను విభిన్న ఆకారాల్లో చాలా అందంగా తయారు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణు ఈ ఫోటోలను షేర్ చేసింది. కాగా ఈ ఫోటోల్లో రేణు చాలా అందంగా కనిపించింది.

దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలు బాగున్నాయని చాలా అందగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి. ఇక మరోవైపు రేణు దేశాయ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus