Renu Desai: రేణూ దేశాయ్‌కి అకీరా స్వీట్‌ షాక్‌… ఏం చేశాడంటే?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌… దీనిని ఎలా కావాలంటే అలా వాడొచ్చు. అంటే ఇటు మంచి చేయొచ్చు, అటు చెడు కూడా చేయొచ్చు. మంచి చేస్తే ఆనందం, చెడు చేస్తే ఖేదం. ఏంటీ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెజెన్స్‌ గురించి క్లాస్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇది క్లాస్‌ కాదు కానీ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వల్ల ఓ సెలబ్రిటీ తల్లి పడుతున్న ఆనందాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే దాని గురించి కాస్త వివరిస్తున్నాం అంతే. ఎవరా సెలబ్రిటీ తల్లి అనుకుంటున్నారా? ఇంకెవరు రేణు దేశాయ్‌.

తన తనయుడు అకీరా నందన్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తరచుగా నెటిజన్లతో పంచుకుంటుంటారు రేణు దేశాయ్‌. తాజాగా అకీరా ఇచ్చిన ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. దీంతో అభిమానులు వాటిని చూసి వావ్‌ అంటున్నారు. అంతగా అందులో ఏముంది అనుకుంటున్నారా? అందులో రేణు దేశాయ్‌ ఫొటో ఉంది. అది కూడా ఏఐతో చేసిన ఫొటో. అందుకే అంత వైరల్‌గా మారింది.

ఇలా ఏఐ వెర్షన్‌లో క్రియేట్‌ చేసిన ఫొటోతో అకీరా తనను సర్‌ప్రైజ్‌ చేశాడని రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘అకీరా.. నా ఏఐ వెర్షన్‌ను క్రియేట్‌ చేశాడు. చూడటానికి ఎంత అందంగా ఉందో. అదే విధంగా భయంగా కూడా ఉంది’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు రేణు దేశాయ్‌. అలాగే, కొన్ని నిమిషాల్లోనే అకీరా ఆ ఫొటోలను క్రియేట్‌ చేశాడని కూడా రేణు దేశాయ్‌ చెప్పారు. దీంతో అభిమానులు వావ్‌ అనుకుంటూ… వాటిని షేర్‌ చేస్తున్నారు.

రేణు దేశాయ్‌ (Renu Desai) విషయానికి వస్తే.. 2003లో ‘జానీ’ తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ నటిస్తోన్న ఈ సినిమాలో రేణు కీలక పాత్రలో కనిపిస్తారు. ఇక అకీరా విషయానికొస్తే… చదువుకుంటూనే సంగీతం శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం కూడా అందించారు. ‘రైటర్స్‌ బ్లాక్‌’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ ఫిల్మ్‌కు అకీరా మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus