Amala: చైతన్యకు ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉంది: అమల

అక్కినేని అమల ఒకప్పుడు నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈమె బయటకు పెద్దగా రావడానికి ఇష్టపడరు తన ఫౌండేషన్ వ్యవహారాలను అలాగే సినిమా షూటింగ్ పనులలో తప్ప ఎక్కువగా ఇంటర్వ్యూలకు, ఇతర ఈవెంట్లలో పాల్గొనడానికి అమల ఏమాత్రం ఆసక్తి చూపించరని చెప్పాలి. ఇలా చాలా తక్కువగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా అమల తన కుమారుడు నాగచైతన్య అఖిల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో అమల అఖిల్ కంటే నాగచైతన్య గురించి ఎక్కువగా మాట్లాడటం తనని పొగడటం విశేషం. యాంకర్ అమలను ప్రశ్నిస్తూ నాగచైతన్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అమల సమాధానం చెబుతూ నాగచైతన్య చాలా తెలివైనవాడు. ఎంతో ధైర్యవంతుడు.. తను తన పని పట్ల సినిమాల పట్ల చాలా ఫోకస్డ్ గా ఉంటారని ఏ విషయంలోనైనా చాలా క్లారిటీగా ఉంటారని అమలా తెలియచేశారు. చైతన్య చాలా బ్రిలియంట్ పర్సన్ అంటూ అమల చైతన్య గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో ఈమె అఖిల్ గురించి కూడా మాట్లాడారు.

అఖిల్ గురించి అమల (Amala) మాట్లాడుతూ.. అఖిల్ మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడు ఈయన పీపుల్ లవింగ్ పర్సన్ అని తెలియజేశారు. అఖిల్ కంటే చైతన్య గురించి ఎక్కువగా మాట్లాడుతూ పొగడటం విశేషం.ఇక ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ బ్లూ క్రాస్ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన నటనతో అందరిని మెప్పించారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus