స్టార్ హీరో నాగార్జున కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో మనం సినిమా కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు మనం సినిమాలో నటించడం గమనార్హం. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. స్టార్ హీరో అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మనం మూవీ రీమేక్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనకు పల్లెటూరి పాత్రలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని పల్లెటూరి పాత్రల విషయంలో నాన్నగారి ప్రభావం ఉంటుందని నాగ్ చెప్పుకొచ్చారు. గ్రామీణ నేపథ్యంలో చైతన్య నటించిన తొలి సినిమా బంగార్రాజు అని నాగ్ అన్నారు. నాన్న ప్రభావం నాపై ఉంటుందని పంచె కడితే నాన్న గుర్తుకొస్తారని నాగ్ చెప్పుకొచ్చారు. పల్లెటూరి పాత్రలలో చిన్న పొగరుబోతుతనం ఉంటుందని నాగార్జున అన్నారు. రమ్యకృష్ణతో తనది గోల్డెన్ కాంబినేషన్ అని నాగ్ అన్నారు. కళ్యాణ్ కృష్ణ సీన్ బాలేదని చెబితే మళ్లీ రాస్తాడని నాగ్ చెప్పుకొచ్చారు.
నాన్న, నేను కలిసి నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయని నాగ్ కామెంట్లు చేశారు. వేరే నటులతో మనం సినిమాను తెరకెక్కించి ఉంటే ఆ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయ్యేది కాదని నాగ్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో మనం సినిమాను చేయాలని చాలామంది ప్రయత్నించారని నేను, నాన్న, నాగచైతన్య కలిసి నటించడం వల్ల ఆ మ్యాజిక్ తోనే మనం సినిమా సక్సెస్ సాధించిందని నాగ్ కామెంట్లు చేశారు. సోగ్గాడే చిన్నినాయన బాగా ఆడిందని సంక్రాంతి స్పెషల్ గా చేసిన సినిమా బంగార్రాజు కాబట్టి పండుగలాంటి మూవీ చేస్తున్నామని మొదటినుంచి చెబుతూ వచ్చామని నాగ్ అన్నారు.
సోగ్గాడే చిన్నినాయన సమయంలో సీక్వెల్ ఆలోచన లేదని బంగార్రాజుకు సీక్వెల్ ఉంటుందో లేదో వారం తర్వాత నిర్ణయం తీసుకుంటానని నాగ్ అన్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన బంగార్రాజు సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!