‘‘అక్షర’’ మొదటి పాటకు మంచి స్పందన

  • March 23, 2019 / 05:45 PM IST

చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేకఅప్పులపాలైన తల్లిదండ్రులు.. వంటి హెడ్ లైన్స్ తరచూ చూస్తున్నాం. అందుకుకారణమేంటీ.. అంటే అక్షరం అంగడి సరుకైంది. విద్య వ్యాపారమైంది అని.. ఇదితప్పని ఎవరికి వారుభావిస్తుంటారే.. తప్ప ఎవరూ మార్పును గురించఆలోచించరు. కానీ అమ్మకపు సరుకుగా మారిన కార్పోరేట్ విద్యా విధానంమారాలంటూ.. అతి పెద్ద వ్యాపారంగా మారిన అక్షరానికి ఆలంబనగా మారిందోయువతి. వివేకాన్ని ఇవ్వవలసిన విద్య వ్యాపారంగా మారితే ఆ వ్యవస్థ ఎంతదారుణంగా మారుతుందనేది అందరికీ తెలుసు. తెలిసీ ఉదాసీనంగా ఉండేవారిని సైతంప్రశ్నిస్తూ అక్షర అనే యువతి సాగించిన పోరాటం నేపథ్యంలో వస్తోన్న సినిమా‘అక్షర’. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

అక్షర సినిమా థీమ్ ను తెలియజేసేలా సాగే ఈ పాట విన్న ఎవరికైనా గూస్ బంప్స్రావడం ఖాయం. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటలోని ప్రతి అక్షరం ఓ అగ్నికణంలాకనిపిస్తుంది. ‘అసులదర.. నిశలు చెదర.. అక్షరాగ్ని శిఖలు ఎగసిఆగ్రహించెలె.. సమరమిపుడే సమయమిపుడే కలం కూడ కత్తి దూసి కదం తొక్కెలే’’అంటూ సాగే ఈ పాట ఈ యేడాదికే ది బెస్ట్ సాంగ్ గా నిలుస్తుందని విన్నఎవరైనా ఒప్పుకుంటారు. గాడి తప్పుతోన్న విద్యావ్యవస్థ పై ఈ స్థాయిలోఅక్షరాలను ఎక్కుపెట్టిన కవి మనకు కనిపించడు. సినిమా థీమ్ ను ఆవాహనచేసుకున్నాడా అనేలా చైతన్య ప్రసాద్ కలం కదం తొక్కింది. ‘‘చదువునే అమ్మితేదోపడీ సాగితే తిరుగుబాటొక్కటే రక్షా’’ అంటూ తేల్చివేస్తాడు. మొత్తంగా ఈపాటతో సినిమా స్థాయి ఏంటో కూడా తెలిసిపోతుంది. అక్షర సినిమాను ప్రతిఒక్కరూ ఖచ్చితంగా చూడాలి అనుకునేలా సాగుతుంది ఈ పాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus