‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “అక్షర”. అల్లరి నరేష్ తో ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ వంటి కామెడీ ఎంటర్టైనర్ ను రూపొందించిన చిన్ని కృష్ణ ఈ చిత్ర దర్శకుడు. అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. పేరులేని పెద్దమనిషిగా కొనసాగుతున్న అజయ్ ఘోష్ కు టిక్ టాక్ లు చేస్తూ సోమరి పోతులుగా గడిపే ముగ్గురు స్నేహితులుంటారు.
వీళ్ళ జీవితంలోకి ‘అక్షర’ అనే ఓ అందమైన టీచర్ వస్తుంది. ఈ క్రమంలో ఆమె వలన వీరు కొన్ని సమస్యల్లో పడతారు. దీంతో ఆమెను చంపెయ్యాలనే నిర్ణయానికి వస్తారు. అయితే వీరు చంపెయ్యాలి అనేంతగా ఆ టీచర్ అక్షర ఏం చేసింది? అసలు ‘అక్షర’ టీచర్ ఎవరు? అనేది సస్పెన్స్ గా టీజర్ సాగింది. ‘ఆస్తి కోసం ప్రాణాల్ని తీసే వాళ్ళని చూసాం.. పరువు కోసం ప్రాణాల్ని తీసేవాళ్ళని చూసాం.. కానీ చదువు కోసం ప్రాణాలిచ్చేవాళ్ళని మొదటిసారిగా చూస్తున్నాం’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా టీజర్ ఓకే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.