బిజీ ఏరియాలో యాక్సిడెంట్.. తృటిలో తప్పించుకున్న స్టార్ కపుల్
- January 20, 2026 / 05:37 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ హీరో హీరో అక్షయ్ కుమార్, భార్య ట్వింకిల్ ఖన్నా కారు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ముంబయిలోని జూహు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు ఆటోని ఢీకొట్టడంతో.. ఆ ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ వాహనాల కాన్వయ్ పైకి దూసుకొచ్చింది. దీంతో ఎస్కార్ట్ కారు ఒకటి బోల్తా కొట్టింది. దీంతో అక్షయ్ ప్రయాణిస్తున్న వాహనం, ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని మరో కారు పరస్పరం ఢీకొన్నాయి.
Akshay Kumar
ఈ క్రమంలో డ్రైవర్లు కంట్రోల్ చేసుకోవడం, ఆటో కాన్వాయ్‌లోని కారును ఢీకొట్టడం వల్ల అక్షయ్ కుమార్ కుటుంబం ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్షయ్, ట్వింకిల్ ఖన్నా విదేశీ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వచ్చారు.

ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుండి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఈ స్టార్ కపుల్‌తోపాటు ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. కొంతమందికి స్వల్పగాయాలయ్యాయని సమాచారం. అయితే ఈ ఘటనలో ఆటో పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.ఇక అక్షయ్ కుమార్, ట్వింకిల్ 25వ పెళ్లి రోజును ఇటీవల విదేశాల్లో జరుపుకున్నారు. పెళ్లినాటి రోజులను గుర్తుచేసుకుంటూ జనవరి 18న ఓ ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. ఈ ప్రయాణానికి 25 ఏళ్లు అంటూ సరదా ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా తిరిగి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరగడం గమనార్హం.
















