బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అక్షయ్ కుమార్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar) రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది. అక్షయ్ కుమార్ నటించిన సర్పిరా మూవీ ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సూరరై పొట్రు సినిమాకు రీమేక్ గా సర్పిరా మూవీ తెరకెక్కగా ఈ సినిమాకు బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.
ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. కేవలం ఈ సినిమాకు సంబంధించి 500 టికెట్లు మాత్రమే మల్టీప్లెక్స్ లలో బుక్ అయ్యాయంటే ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ షాక్ తగులుతోంది. అక్షయ్ కుమార్ రేంజ్ కు ఈ బుకింగ్స్ మరీ ఘోరమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్2 (Bharateeyudu 2) సినిమాకు పోటీగా విడుదలవుతుండటం, కల్కి (Kalki 2898 AD) సినిమా జోరు తగ్గకపోవటం కూడా బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అక్షయ్ కుమార్ తన సినిమా బుకింగ్స్ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సర్పిరా సినిమాకు అశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. అక్షయ్ కుమార్ సర్ఫరీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. అక్షయ్ కుమార్ సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.