బన్నీ ఫ్యాన్స్.. ఇక మీరు పండగ చేసుకోవచ్చు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది..! గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు పెద్ద హిట్టవ్వడంతో ‘అల వైకుంఠపురములో’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఇటీవల కొందరు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ లు వీక్షించారట.

వారి సమాచారం ప్రకారం… ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయట. ఇక అల్లు అర్జున్ తన స్క్రీన్ ప్రెజన్స్, డాన్స్ లతో మ్యాజిక్ చేస్తాడట. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందట. సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ మాస్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలైట్ అని కూడా వారు చెబుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, ఎమోషనల్ సీన్స్ బాగా మెప్పిస్తాయని తెలుస్తుంది. మొత్తంగా ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే పెద్ద హిట్ అయ్యి.. 100 కోట్ల షేర్ కు పైనే వసూళ్ళను సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus