25 రోజులు పూర్తికావస్తున్నా ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మార్నింగ్ షోలు, మ్యాట్నీ లు కొంచెం డల్ గా ఉంటున్నప్పటికీ.. ఈవెనింగ్ షోల నుండీ మళ్ళీ గ్రోత్ చూపిస్తూనే ఉంది ఈ చిత్రం. ఓ పాన్ ఇండియా చిత్రం కూడా ఇన్ని రోజులు డీసెంట్ కలెక్షన్లను రాబట్టాడేమో అనేంతలా ఆశ్చర్యపరుస్తుంది ఈ చిత్రం ! ఈరోజు లేదా రేపు కచ్చితంగా ఈ చిత్రం 250కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 24 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
43.18 cr
సీడెడ్
17.93 cr
ఉత్తరాంధ్ర
19.35 cr
ఈస్ట్
11.13 cr
వెస్ట్
8.74 cr
కృష్ణా
10.48 cr
గుంటూరు
10.86 cr
నెల్లూరు
4.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
11.72 cr
ఓవర్సీస్
18.22 cr
వరల్డ్ వైడ్ టోటల్
156.15 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 24 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…126.21 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..156.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 249.73 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి.