అరవవారంలో కూడా ‘అల వైకుంఠపురములో’ సత్తా చాటిందనే చెప్పాలి. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు చతికిలపడటంతో మళ్ళీ ఈ చిత్రానికి కలిసొచ్చింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతుంది. దీంతో సంక్రాంతి విన్నర్ అయిన ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఎక్కువ ప్లస్ అయ్యిందని చెప్పాలి.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 36 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 44.55 cr |
సీడెడ్ | 18.19 cr |
ఉత్తరాంధ్ర | 19.77 cr |
ఈస్ట్ | 11.37 cr |
వెస్ట్ | 8.89 cr |
కృష్ణా | 10.73 cr |
గుంటూరు | 11.11 cr |
నెల్లూరు | 4.69 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.82 cr |
ఓవర్సీస్ | 18.34 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 159.46 cr (share) |
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 36 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…129.30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..159.46 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 254.88 కోట్లను కొల్లగొట్టింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైందో చూడాలి.
Click Here For Ala Vaikunthapurramloo Movie Review
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!