అల వైకుంఠపురములో అన్నీ ప్లస్ పాయింట్స్

  • January 9, 2020 / 01:03 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ చిత్రం విడుదలవుతోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 165 నిమిషాలు.

ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓ రేంజ్ లో ఉందని.. తమన్ బీజియం మరో హైలైట్ అని చెబుతున్నారు. మాస్ సీన్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ తో సెకండ్ హాఫ్ మరింత ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకున్నాయని అంటున్నారు. జయరాం, మురళీశర్మ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్.. నవదీప్, రాహుల్ రామకృష్ణల కామెడీ సినిమాకి ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. సినిమాపై ఎక్కువ శాతం పాజిటివ్ ట్వీట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus