Ali,Pawan Kalyan: పవర్ స్టార్ పై అభిమానాన్ని చాటుకున్న అలీ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో అలీ (Ali) ఒకరు కాగా అలీ కామెడీ టైమింగ్ కు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలీ ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించలేదు. పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీ ఆ షోల ద్వారా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలల క్రితం వరకు వైసీపీలో ఉన్న అలీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సుమ అడ్డా షోలో ఆన్ స్క్రీన్ పై యాక్ట్ చేసిన హీరోలలో రవితేజ (Ravi Teja) పవన్ లలో (Pawan Kalyan) ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా పవన్ పేరును అలీ సమాధానంగా ఉన్నారు. అలీ చెప్పిన ఈ సమాధానం విని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్, అలీ మధ్య గ్యాప్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ నటిస్తున్న సినిమాలలో అలీకి అవకాశం దక్కుతుందేమో చూడాలి.

గతంలో వైసీపీలో ఉండటం వల్ల అలీ వైసీపీకి అనుకూలంగా పవన్ కు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంది. ప్రస్తుతం అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇకపై అతనికి ఏ పార్టీతో సత్సంబంధాలు లేనట్టేనని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరో రాజకీయ పార్టీలో చేరే ఆలోచన కూడా అలీకి అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతున్న నేపథ్యంలో కమెడియన్లకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)   డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అలీ ఎక్కువగా నటిస్తున్నారు. అలీ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల ద్వారా అలీ పవన్ పై అభిమానాన్ని చాటుకున్నారనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus