Ranbir, Alia: రణబీర్- అలియా భట్ ల పెళ్ళి అయిపోయిందట..!

గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్ళి అయిపోయిందట. వీరి వివాహం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 17న వీరి పెళ్ళి ఉండొచ్చు అని అన్నారు. కానీ 3 రోజులు ముందుగానే వీరి పెళ్ళి జరిగిపోయింది.పెద్దగా హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. ఈరోజు అనగా ఏప్రిల్ 14న( గురువారం) రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని ‘వాస్తు’లో వీరి వివాహం జరిగింది.

Click Here To Watch NOW

వీరి వివాహానికి తోటి నటీనటులైన కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, ఆకాష్‌ అంబానీ,కరణ్‌ జోహార్‌ వంటి స్టార్లు విచ్చేసినట్టు తెలుస్తుంది.అయితే వీరి పెళ్ళి ఫోటోలు మాత్రం ఇంకా బయటకి రాలేదు.వీరి పెళ్ళి ఎటువంటి లీక్ లు లేకుండా సడన్ గా జరిగిపోయింది. మరికాసేపట్లో ఆలియా -రణ్‌బీర్‌ల పెళ్ళి ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ కానున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్ళి ఫోటోల కోసం నెటిజన్లు తెగ వెయిట్ చేస్తుంటారు.

అలాగే వీళ్ళ పెళ్ళి ఫోటోలను పలు డిజిటల్ సంస్థలు భారీ రేటు చెల్లించి కొనుగోలు చేస్తుంటాయి. తద్వారా వారి బ్రాండ్ ప్రమోట్ అవుతుందనేది ప్రధాన ఉద్దేశం. అలియా భట్ తాతగారి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వీరి వివాహాన్ని సడన్ గా జరిపించారు పెద్దలు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తో అలియా తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె రాంచరణ్ కు జోడీగా.. అల్లూరి సీతారామరాజు మరదలు సీత పాత్రలో కనిపించింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus