Alia Bhatt Baby Bump: భర్తతో అలియా భట్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

  • August 6, 2022 / 06:34 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలియా భట్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే అలియా భట్ తాజాగా బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అలియా భట్ రణ్‌బీర్‌ ‍కపూర్‌ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత అలియా భట్ తాను గర్భవతి అని అభిమానులకు తీపికబురు చెప్పారు. అయితే గర్భం దాల్చినా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ అలియా భట్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అలియా భట్ ఆ సినిమాలపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం. తాజాగా అలియా భట్ భర్తతో కలిసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

కొన్నిరోజుల క్రితం వరకు బేబీ బంప్ కనబడకుండా జాగ్రత్త పడిన అలియా భట్ తాజాగా బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ ధరించారు. త్వరలోనే అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో బ్రహ్మాస్త్ర సినిమాతో అలియా భట్ మరో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బ్రహ్మాస్త్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలియా భట్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలామంది స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే అలియా భట్ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

1

2

3

4

5

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus