బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని.. ఇటీవల పండంటి ఆడపిల్లకి జన్మించిన సంగతి తెలిసిందే. అలియా భట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆమె గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికీ ఆమె వాటిని ఇగ్నోర్ చేసింది. ఫైనల్ గా ఓ పాపకు జన్మించినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక అలియా భట్ తన కూతురికి రహ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
అయితే పాప ఫోటోని మాత్రం అలియా సరిగ్గా చూపించింది లేదు. ఈ విషయమై ఆమెకు సోషల్ మీడియాలో బోలెడన్ని మెసేజ్ లు వంటివి వస్తూనే ఉన్నాయి. అయితే పాపకు దిష్టి తగులుతుందనో.. ఏమో కానీ ఇంకా తన పాప ఫోటోని మాత్రం ఈమె చూపించింది లేదు. తాజాగా అలియా ఓ ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఆమె తన బేబీకి ఫీడింగ్ ఇస్తూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఎరుపు రంగు చీరలో అలియా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తుంది.
ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. కొంతమంది ఈ ఫోటో పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. మరికొంతమంది ఆ నెగిటివ్ గా కామెంట్లు చేసే వారిపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ రకంగా ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :