Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?
- October 28, 2026 / 08:44 PM ISTByFilmy Focus Desk
విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ.. ‘రామాయణ’ సినిమా చుట్టూ ఇబ్బందులు వచ్చి చేరుతున్నాయి. నిన్న మొన్నటివరకు పాత్రలు, వారి దుస్తులు, కొన్ని సన్నివేశాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న చిత్రబృందం.. ఇప్పుడు సినిమాకు ఉన్న హైప్‌ను తగ్గించేలా టీమే చేసుకుంటోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. దానికి తాజా కారణం రెహమాన్ అందించిన సంగీతం. ‘రామాయణ’ లాంటి ఇతిహాస నేపథ్యం ఉన్న సినిమాకు ఇలాంటి పాటలా ఇచ్చేది అంటూ విమర్శలు వస్తున్నాయి.
Ramayana
‘రామాయణ’ సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. ‘రావణ తాండవ్’, ‘రంగులు రంగులే’ పాటలపై అంత పాజిటివ్ ఒపీనియన్ ప్రేక్షకుల్లో లేదు అనే చెప్పాలి. పాత పాటలను కాస్త అటు ఇటు మార్చి ఈ ట్యూన్స్ చేశారు అనేది విమర్శల సారాంశం. అయితే ఈ కామెంట్లపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇప్పుడు విమర్శించిన వారే.. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని నమ్మకంగా చెప్పుకొచ్చారు.

మరోవైపు ఈ సినిమా ప్రచార చిత్రాల్లో రావణుడి హైలైట్ చేయడం కూడా సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి ఓ కారణం. సినిమా ప్రచార చిత్రాల్లో రావణుడి కనిపించినంతగా రాముడు కనిపించడం లేదు అంటున్నారు. ఇక హనుమంతుడు అయితే ఇంకా ఎక్కడా కనిపించలేదు. మొన్నామధ్య రావణుడి అలియాస్ యశ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటాయి.. వాటిని పట్టించుకోవద్దు’ అన చెప్పారు..

దీంతో రూ.2000 కోట్లు (సుమారు) పెట్టి తీసిన సినిమా విషయంలో తప్పులుంటాయి క్షమించండి అని అనడం సినిమాకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది అని చెప్పొచ్చు. దీంతో సినిమా రిలీజ్‌కి ముందు ఇవన్నీ ఇబ్బందులే అని చెప్పాలి. ఇవి కాకుండా రామయణాన్ని నచ్చినట్లుగా తీసేశారు అనే విమర్శలు ఎలాగూ వస్తాయి. వాటికి కూడా చిత్రబృందం సమాధానాలు చెప్పాలి. వీటన్నింటిని నితేశ్ తివారీ అండ్ టీమ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.















