అలియా కొత్త ఫ్లాట్ ఖరీదు.. రూ.32 కోట్లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రణబీర్ ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే అలియా ఫ్లాట్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ముంబైలో ఓ పోష్ ఏరియాలో అలియా అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసింది. అదే అపార్ట్మెంట్స్ లో తన ప్రియుడు రణబీర్ కపూర్ కి కూడా ఓ ఫ్లాట్ ఉందట. రణబీర్ కి ఏడవ అంతస్థులో అల్ట్రా స్పేషియస్ ఫ్లాట్ ఉంటే.. అలియా అదే భవనంలో ఐదవ అంతస్థులో అపార్ట్మెంట్ తీసుకుంది.

2460 చదరపు అడుగుల గల ఈ అపార్ట్మెంట్ కోసం రూ.32 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా దీపావళి సందర్భంగా ఈ కొత్త ఫ్లాట్ లో లక్షీదేవి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పూజకి రణబీర్ కపూర్, కరణ్ జోహార్ లతో పాటు బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. తన కొత్తింటి ఇంటీరియర్ డిజైనింగ్ బాధ్యతలను గౌరీ ఖాన్ కి అప్పగించింది అలియా. గతంలో గౌరీ ఖాన్.. ముఖేష్ అంబానీ, రాల్ఫ్ లారెన్, కరణ్ జోహార్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ప్రముఖుల ఇళ్లకి ఇంటీరియర్ డిజైనర్ గా పని చేశారు.

2016 లో రణబీర్ అపార్ట్మెంట్ కి కూడా ఇంటీరియర్ డిజైనింగ్ గౌరీ ఖాన్ చేశారు. ఇప్పుడు అలియాభట్ ఇంటి కోసం పని చేస్తుండడం విశేషం. ఇప్పటికే అలియాకి జుహూ ఏరియాలో 13 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్ ఉంది. అలానే లండన్ లో కూడా ఓ ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడు మరో ఇంటిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల కోసం పని చేస్తోంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus