Alia Bhatt: హాలీవుడ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అలియా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఆలియా భట్ ఒకరు. ఈమె కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బాలీవుడ్ టాలీవుడ్ మాత్రమే కాకుండా ఈమె హాలీవుడ్ సినిమాలో కూడా నటించే అవకాశాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక గత ఏడాది ఈమె వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనివ్వడంతో అలియా భట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్స్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ నటించిన మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్స్ ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన సందర్భంగా అలియా భట్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సినిమాలో తాను యాక్షన్ సన్ని వేషాలలో నటించాలని తెలిపారు. ఈ సినిమాలో నటించే సమయంలో తనకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ సినిమాలో నటించానని ఈమె వెల్లడించారు. ముందుగా ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ అనే విషయం తెలిసింది. అయితే కొన్ని యాక్షన్ సన్ని వేషాలు అనుకున్న విధంగా రాకపోవడంతో తిరిగి షూట్ చేయాలని చెప్పారు. అయితే అప్పటికి ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటికీ నాకు ఇది మొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ప్రెగ్నెన్సీ తో కూడా నటించానని తెలిపారు.

ఫస్ట్ హాలీవుడ్ చిత్రం కావడంతోనే తాను (Alia Bhatt) ఇలాంటి సాహసం చేశానని అయితే తనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సీన్స్ చిత్రీకరించారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus