Nag Ashwin: నాగ్ అశ్విన్.. కల్కి తరువాత ఆమెతోనా?

‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD)  తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ కు (Nag Ashwin) దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇండియాలో మొదటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరపై సరికొత్త దృశ్యాలను ఆవిష్కరించి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) క్యారెక్టర్ డిజైన్ పై బాలీవుడ్ లోనూ ప్రత్యేక ప్రశంసలు లభించాయి. దీపికా పదుకునే (Deepika Padukone) తన మొదటి తెలుగు చిత్రంతో ‘కల్కి’ లో కనిపించి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Nag Ashwin

ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో నాగ్ అశ్విన్ ఓ లేడీ ఒరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల అలియా భట్ (Alia Bhatt) కు ఓ కొత్త కథను నాగ్ అశ్విన్ నేరేట్ చేశారని, ఆ కథ ఆమెకు బాగా నచ్చి, సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అలియా భట్, ఈ లేడీ ఓరియెంటెడ్ కథను చేయడానికి ఆసక్తి చూపుతోంది.

ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా భారీ బడ్జెట్ తో నిర్మించబడనుందని సమాచారం. లార్జ్ స్కేల్ లో ఈ కథను ప్రేక్షకులకు అందించాలని నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నారట. ‘కల్కి 2898ఏడీ’ పార్ట్ 2 పూర్తి చేసిన తర్వాతే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ కథపై మరింత శ్రద్ధ పెట్టాలని చూస్తున్నారు. 2025 చివరిలో కల్కి పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించి, 2028 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే అలియా భట్ తో కొత్త ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారని టాక్. అలియా భట్ ప్రస్తుతం హిందీలో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ అండ్ వార్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , విక్కీ కౌశల్ తో (Vicky Kaushal) కలిసి అలియా నటించనుంది. ఇక కల్కి పార్ట్ 2 తరువాత నాగ్ అశ్విన్, అలియా భట్ కాంబినేషన్ లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. మరో స్టార్ కోసం వేట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus