Alia Bhatt: అలియా-రణబీర్ ల పెళ్ళికి ముహూర్తం ఫిక్సయ్యిందట..!

  • April 5, 2022 / 07:22 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది హీరోయిన్ అలియా భట్. ఈ చిత్రంలో ఆమె చరణ్ కు జోడీగా అల్లూరి సీతారామరాజు మరదలు సీత పాత్రలో నటించింది. ఈమె కనిపించింది కాసేపే అయినా కథని క్లైమాక్స్ కు చేర్చేది మాత్రం ఈమె పాత్రనే చెప్పాలి. ఇదిలా ఉండగా… ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్ కపూర్ తో ఈమె చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

నిజానికి వీరి పెళ్ళి 2020లోనే అయిపోయేది కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తర్వాత వీళ్ళ కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో పడి పెళ్ళి సంగతి మర్చిపోయారు. అయితే వీలైనంత త్వరగా ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అలియా భట్‌ తాతగారు ఎన్‌ రజ్దాన్‌ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందట. ఆయన చనిపోయేలోపు అలియా వివాహం చూడాలనేది ఆయన కోరికగా తెలుస్తుంది.

ఇదే విషయాన్ని ఆయన అలియా ,రణ్‌బీర్‌ లతో పాటు వీరి పెద్దలకి కూడా చెప్పినట్లు తెలుస్తుంది.ఈ పెద్దాయన కోరిక తీర్చడం కోసం ఈ జంట ఏప్రిల్‌ 17న పెళ్ళి పీటలెక్కనుందని తెలుస్తుంది. ఇంకా కుదిరితే ఏప్రిల్ 2వ వారంలోనే పెళ్ళి చేసుకునేందుకు వీరు చూస్తున్నారట. ‘ఆర్‌కే స్టూడియోస్‌’లో వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుంది.ఆర్కే హౌస్‌ కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం అన్న సంగతి తెలిసిందే.

కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలో ఉన్న ఈ ఆర్కే హౌస్‌‌ను సెంటిమెంట్‌గా భావిస్తుంటారన్న సంగతి కూడా తెలిసిందే. రణ్‌బీర్ పేరెంట్స్ అయిన రిషి కపూర్, నీతూ కపూర్‌ల వివాహం కూడా ఇక్కడే జరిగింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus