Alia Bhatt in RRR: అయ్యో.. అలియా పాత్ర నిడివి అంత తక్కువా?

  • November 27, 2021 / 04:58 PM IST

స్టార్ హీరో రాజమౌళి డైరెక్షన్ లో చిన్న పాత్రలో నటించినా వచ్చే గుర్తింపు అంతాఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో అలియా భట్ కేవలం 20 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం అలియా రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ కోసం అలియా భట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ లో క్రేజ్ ఉండటంతో అలియాకు భారీగా పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. బాలీవుడ్ లో పుల్ లెంగ్త్ రోల్ కు 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న అలియా ఆర్ఆర్ఆర్ లో 20 నిమిషాల పాత్రకే ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకేరోజు రిలీజ్ కానుండగా రికార్డు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అలియా భట్ ఇచ్చిన డేట్స్ కూడా తక్కువేనని సమాచారం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అలియా భట్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కథను మలుపు తిప్పే పాత్రలో అలియా భట్ నటిస్తుండగా ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు వస్తుందని చరణ్, తారక్ భావిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus