రాజమౌళికి కాల్ చేసిన అలియా భట్.. మేటర్ ఏంటంటే?

ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినా.. పెద్ద సినిమాలకు అది అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. కనీసం రాజమౌళి చరణ్, ఎన్టీఆర్.. డూప్ లతో కూడా ట్రయిల్ షూట్ ను నిర్వహించలేకపోయాడు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు.. బర్త్ డే టీజర్ ను విడుదల చెయ్యలేదు అని ఆడేసుకుంటున్నారు. ఇలాంటి టైములో ఇప్పుడు అలియా భట్ కూడా జక్కన్నకు ఓ బాంబ్ పేల్చిందట. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఆమె అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న చరణ్ కు జోడీగా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే కనీసం ఆగష్ట్ నుండీ రెగ్యులర్ షూటింగ్ నిర్వహించాలి.. మొదట చరణ్ కు హీరోయిన్ తో ఉన్న సీన్లను తీసేయ్యాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నడాట. కానీ ఇంతలో అలియా భట్ నుండీ జక్కన్నకు ఫోన్ వచ్చింది. ఇప్పట్లో ‘నేను రెగ్యులర్ షూటింగ్ కు జాయిన్ అవ్వలేను. క*నా వైరస్ విజ్రుంభిస్తున్న తరుణంలో ఇప్పుడు షూటింగ్ లో జాయిన్ అయ్యే రిస్క్ చెయ్యలేను’ అని ఆమె చెప్పిందట. నిజానికి 2019 ఏప్రిల్ లోనే అలియా భట్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో జాయిన్ అవ్వాల్సి ఉంది.

కానీ ఇద్దరి హీరోలకు గాయాలు అవ్వడంతో ఆమె షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు వైరస్ మహమ్మారి వల్ల లేట్ అవుతూ వస్తుందని తెలుస్తుంది. ఇక మరోపక్క చరణ్ .. ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో తన పార్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నట్టు సమచారం.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus