Kalki 2898 AD: కమల్‌ని అనుకోలేదట.. మిగిలిన అందరూ ప్లాన్ ప్రకారమే!

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  సినిమాకు సంబంధించి విడుదలకు ముందు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఏంటి అంటే.. కమల్‌ హాసన్‌ పాత్రనే. సినిమాలో కమల్‌ నటిస్తారనే ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సినిమా రిలీజ్‌కి టైమ్‌ దగ్గరపడుతోంది అని అనుకుంటున్నప్పుడే ఆ ఇంక్లూషన్‌ను అనౌన్స్‌ చేశారు. మనకే కాదు.. సినిమా ప్రధాన పాత్రధారులు చాలామందికి కూడా ఇది సర్‌ప్రైజ్‌ అట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్‌ చెప్పారు. ప్రభాస్‌ (Prabhas) – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’.

విడుదలైన తొలి రెండు రోజుల్లో సుమారు 300 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్‌ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమాలోని కీలక పాత్రలు అతిథి పాత్రల గురించి వివరించారు. యాస్కిన్‌ పాత్ర కోసం తొలుత కమల్‌ను (Kamal Haasan) అనుకోలేదని, అనుకోకుండా ఆయన యాడ్‌ అయ్యారు అని నిర్మాత తెలిపారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసినవాళ్లు నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ను మెచ్చుకుంటున్నారు అని మురిసిపోయిన అశ్వనీత్‌..

అమితాబ్‌ పాత్ర విషయంలో నాగీ అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడని మెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ మొదలుపెట్టే ముందు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో (Singeetam Srinivasa Rao) మాట్లాడామని, ఆయన సూచనలు చేశారని… అవి సినిమాకు హెల్ప్‌ అయ్యాయని తెలిపారు నిర్మాత. సినిమాలో బుజ్జి కాన్సెప్ట్‌ నాగ్‌ అశ్విన్‌దేనని చెప్పిన ఆయన.. సుప్రీం యాస్కిన్‌ పాత్ర కోసం తొలుత కమల్‌ హాసన్‌ను అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ (Rajendra Prasad), భైరవను పెంచిన కెప్టెన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), హోటల్‌ ఓనర్‌గా రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma), ఆటోమొబైల్‌ పార్ట్స్‌ షాప్‌ ఓనర్‌గా రాజమౌళి (Rajamouli).. ఇలా మిగిలిన అందరు అతిథి పాత్రలు చేసిన అందరినీ మొదటినుంచే అనుకున్నామని చెప్పారు అశ్వనీదత్‌. అయితే, గతంలో పుకార్లు వచ్చినట్లుగా తారక్‌ (Jr NTR), నాని (Nani) పాత్రల గురించి నిర్మాత ఎక్కడా స్పందించలేదు. అయితే ఈ ఇద్దరూ రెండో పార్టులో ఉంటారు అని లేటెస్ట్‌గా పుకార్లు వస్తున్నాయి. మరి ఏమంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus