లైన్ క్లియర్….ఇక రికార్డుల వేట మొదలు!!!

ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ టైగర్  హవా నడుస్తుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. అవును నిజమే చిన్న వయసులోనే రికార్డుల దుమ్ము దులిపి మడతపెట్టి తన జేబులో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత కొన్ని వరుస పరాజయాల పుణ్యమా అని వెనుక బడ్డాడు. అయితే హిట్స్ పరంగా ఎన్టీఆర్ వెనుక పడినా రేంజ్, ఆయన నటన అన్నీ ఆయన్ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ముందుకు నడిపిస్తున్నాయి. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ తాజాగా జనతా గ్యారేజ్ తో సెప్టెంబర్ 2న దూసుకు వస్తున్నాడు. మార్ పక్క చియాన్ విక్రమ్ సైతం ఇంకొకడు అన్న సినిమాతో అదే రోజు వచ్చేందుకు సిద్దం అయ్యాడు…

అయితే అనుకోకుండా విక్రమ్ తాను తన సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ చెప్పాడని సమాచారం..అయితే అసలు ఏం జరిగింది అంటే….ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం,  మొదట ఈ రెండు మూవీలు ఒకే రోజు రిలీజ్ అవుతాయని రెండు మూవీలకి సంబంధించిన నిర్మాతలకి తెలిసినప్పటికీ…వీరు ఆ పోటీకి రెడీ అన్నట్టుగానే ఉన్నారు. విక్రమ్ సైతం.. ‘జనతా గ్యారేజ్’రిలీజ్ రోజే రిలీజ్ చేయండి అని నిర్మాతలకి చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎవరికి వారు తమ సినిమాల పై అంత ధీమాగా ఉన్నారు.

అయితే అదే క్రమంలో ‘జనతా గ్యారేజ్’ మూవీ నైజాం రైట్స్ ని దిల్ రాజు భారీగా కొనడమే కాకుండా..నైజాంలో థియోటర్స్ ని తన హస్తగతం చేసుకోవాలని దిల్ రాజు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇంకొక్కడు మూవీకి నైజాంలో థియోటర్స్ దొరికే పరిస్థితి లేదు. దీని కారణంగా ఇక చేసేది ఏమీ లేక…జూనియర్ కి విక్రమ్ ఫోన్ చేసి…‘జనతా గ్యారేజ్’ కి ఆల్ ది బెస్ట్ చెప్పి తన మూవీని పోస్ట్ పోన్ చేసుంటున్నానని, ఇదంతా ఇండస్ట్రీ బాగుకోసమే అని చెప్పాడని సమాచారం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus