Peddi: బుచ్చిబాబు హిట్‌ ఫార్ములా ఫాలో అయ్యారా? ఆయన కాన్సెప్టే అదా?

రామ్‌చరణ్‌ను (Ram Charan)  ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుంది అనేది కొంతమంది దర్శకులకే తెలుసు. అందుకే వారి చేతిలో చరణ్‌ పడినప్పుడు ఆ సినిమా బాగుంటుంది. పాత్రలకు కూడా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు సంపాదించిన పాత్రల్లో చిట్టిబాబు ఒకటి. ‘రంగస్థలం’లో (Rangasthalam) రామ్‌చరణ్‌ను అలా చూపించిన మెప్పించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar). ఈ సినిమా తీసిన తర్వాత చరణ్‌ రేంజి మారిపోయింది. అప్పటికి మాస్‌ హీరోగా పేరున్నా.. పర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆ సినిమా పీక్స్‌ అని చెప్పాలి.

Peddi

ఇక అల్లు అర్జున్‌కు అలాంటి ఫీల్‌ రెండు సినిమాలతో ఇచ్చారు సుకుమార్‌. అవే ‘పుష్ప’ సినిమాలు. ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? ‘పెద్ది’ (Peddi) సినిమా పోస్టర్‌ వచ్చినప్పటి నుండి ఈ సినిమాల గురించే చర్చ నడుస్తోంది. మధ్య మధ్యలో తారక్‌ (Jr NTR) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)  సినిమా ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) గురించి డిస్కషన్‌ వస్తోంది. దీనికి కారణం ఆ నాలుగు సినిమా పోస్టర్లు, అందులోని హీరో లుక్సే.

కావాలంటే ‘రంగస్థలం’, ‘పుష్ప: ది రైజ్‌ (Pushpa), ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2), ‘తారక్‌ – నీల్‌’ సినిమా పోస్టర్లు పక్కపక్కన పెట్టి చూడండి మీకే విషయం అర్థమైపోతుంది. అన్నింటా అదే ఇంటెన్స్‌ లుక్‌, అదే రస్టిక్‌ బ్యాగ్రౌండ్‌ కనిపిస్తుంది. దీంతో బుచ్చిబాబు (Buchi Babu Sana)  హిట్‌ ఫార్ములా ఫాలో అయ్యారా? లేక ఆయన కాన్సెప్టే అదా అనే డౌట్‌ వస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు వచ్చాయి. ఆ ఫొటోను పట్టి పట్టి చూస్తే తన గురువు సుకుమార్‌ ప్రభావం బుచ్చిబాబు మీద బలంగా ఉంది అని అర్థమవుతోంది.

అయితే ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల పోస్టర్లలో చుట్ట లేదు. ఇందులో ఉంది అంతే. అయితే బుచ్చిబాబును అంత ఈజీగా తీసుకోలేం. ఆయనలో మాస్‌ మెటీరియల్‌ చాలా ఉందని సుకుమార్‌ చాలాసార్లు చెప్పారు. అలాగే అనుకున్న సినిమా అనుకున్నట్లు వచ్చేంతవరకు ఆయన వదిలి పెట్టే రకం కూడా కాదు అని సుకుమార్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి లుక్స్‌ ఎలా ఉన్నా.. ఫీల్‌ మాత్రం బుచ్చిబాబు స్టైల్‌లో ఉండటం పక్కా అని చెప్పొచ్చు. గ్లింప్స్‌ టీజర్‌తో ఈ విషయం తేలుతుంది అని కూడా అంటున్నారు.

పుకార్లు పటాపంచల్‌.. ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది.. వరుడు ఎవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus