అఖిల్ క్లాప్ కొట్టేది ఎప్పుడంటే..!

అక్కినేని అఖిల్ ఐదో సినిమాని మంచి యాక్షన్ సినిమాగా ప్లాన్ చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. అఖిల్ సినిమాతో దెబ్బతిన్నా, హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో కాస్త ఫర్వాలేదనిపించాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ అండ్ టీమ్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అయ్యింది. చక చకా ఈ సినిమాని ఎలాగైనా సరే ఫినిష్ చేసి సురేందర్ రెడ్డి అండ్ టీమ్ తో జాయిన్ అయిపోవడానికి కసరత్తులు చేస్తున్నాడు అఖిల్.

ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించేందుకు స్పెషల్ వర్కౌట్స్ కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన సురేందర్ రెడ్డి లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడని టాక్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకి క్లాప్ కొట్టేస్తారని ఎక్కువ శాతం ఫారిన్ లోనే షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సినిమాని ఏకె ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. భారీ యాక్షన్ సీన్స్ తో ఈసినిమా చాలా స్టైలిష్ గా ఉంటుందని అందుకు తగ్గట్లుగానే భారీ బడ్జెట్ కూడా అవుతోందని చెప్తున్నారు. అఖిల్ సరసన హీరోయిన్ గా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. అఫీషియల్ గా క్లాప్ కొట్టేటప్పుడు స్టార్ కాస్టింగ్ ని ప్రకటించే అవకాశం ఉంది. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus