శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘హ్యాపీ డేస్’ ‘లీడర్’ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’ ఇలా అన్నీ మంచి సినిమాలు చేసారాయన. ఇందులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పెద్దగా ఆడలేదు కానీ.. మిగిలిన సినిమాలు బాగానే ఆడాయి. ‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి ఎలాంటి సినిమా రాలేదు. ఆయన కూడా తొందరపడి సినిమా చేసే రకం కాదు.
లేటైనా మంచి సినిమా చేయాలని భావిస్తారు. అయితే 2021 లోనే కోలీవుడ్ స్టార్ హీరో (Dhanush) ధనుష్ తో ఓ సినిమా అనౌన్స్ చేసారు. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా రూపొందనుంది. నాగార్జున కూడా ఈ ప్రాజెక్టులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ నిర్మాతలైన ‘ఎస్ ఎల్ వి సి సి’ బ్యానర్ వారే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ ఇంకా ఇవ్వడం లేదు. పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి.. అందులోనూ ధనుష్, నాగార్జున..లు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. లేట్ అవుతూ వస్తుంది అని అంతా భావిస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. ముంబై, కొచ్చి .. వంటి లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది అని సమాచారం.