Dhee: ఈ సారి రచ్చ వేరే లెవల్‌.. ఢీ ప్రీమియర్‌ లీగ్‌ షురూ..!

తెలుగు టెలివిజన్స్ లో పాపులర్‌ డాన్సు షోగా నిలిచింది `ఢీ`. ఇప్పటి వరకు పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్‌ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. గ్లామర్‌, హంగామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. జూన్‌ 21 నుంచీ ఈ సరికొత్త సీజన్ ప్రారంభమైంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమో చాలా క్రేజీగా ఉంది.

అయితే ఈ సారి (Dhee) `ఢీ`రెట్టింపు ఎనర్జీతో, మరింత స్పెషల్‌ గా రాబోతుంది. అందుకు పేరు కూడా మార్చారు. `ఢీ ప్రీమియర్‌ లీగ్‌` పేరుతో ఈ 16వ సీజన్‌ని స్టార్ట్ చేస్తుండటం విశేషం. ఇందులో గత సీజన్ లో సందడి చేసిన కమెడియన్‌ బ్యాచ్‌ని దించారు. హైపర్‌ ఆదిని గత సీజన్‌లో తొలగించారు. ఇప్పుడు ఆయన్ని మళ్లీ తీసుకొచ్చారు. రావడం రావడంతోనే తనదైన స్టయిల్‌లో పంచ్ లు, సెటైర్లు, కామెడీతో నవ్వులు పూయించారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రచ్చ చేశాడు హైపర్‌ ఆది.

గ్లామర్‌ సైడ్‌ దీపికా పిల్లిని దించారు. గత రెండు సీజన్లలో ఈ బ్యూటీని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి తీసుకొచ్చారు. ఆమె రావడం రావడంతో డాన్సులతో రచ్చ చేసింది. కిర్రాక్‌ లుక్‌, డాన్సుతో ఫిదా చేసింది. ఆమెతోపాటు జడ్జ్ గా హాట్‌ బ్యూటీ పూర్ణ వచ్చింది. ఆమె గత సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. పెళ్లి, ప్రెగ్నెంట్‌ కావడంతో దూరంగా ఉన్నారు. ఇప్పుడు నార్మల్‌ స్థితికి రావడంతో మళ్లీ తీసుకొచ్చారు. అప్పుడు హాట్‌గా అలరించిన పూర్ణ ఇప్పుడు బొద్దుగా మారిపోయింది.

క్యూట్‌గానూ అయ్యింది. ఆమెతోపాటు శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మేల్స్ డాన్సర్ల టీమ్‌ వైపు లీడర్స్ గా బిగ్‌ బాస్‌ విన్నర్‌ సన్నీని దించారు. బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సన్నీతోపాటు కమెడియన్‌ సుదర్శన్‌ సైతం వచ్చారు. అలాగే హీరో వరుణ్‌ సందేశ్‌ కూడా షోలో భాగం కాబోతున్నారు. మరి ఆయన గెస్ట్ గా వచ్చారా? షో మొత్తం ఉంటారా? అనేది చూడాలి. ఇక యాంకర్‌గా ప్రదీప్‌ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఇది ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో, అలరిస్తుందో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus