Karan Johar: సూపర్‌ హిట్‌ సినిమాను తీసుకొస్తున్న బాలీవుడ్‌ నిర్మాత!

బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ టాలీవుడ్‌కి రాబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఓ సినిమా రీమేక్‌తో ఆయన టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. నిజానికి ఇది ఎంట్రీ కాదు, సెకండ్ సినిమా అనుకోవచ్చు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన మలయాళ చిత్రం ‘హృదయం’ తెలుగులో రీమేక్‌ చేయాలని చూస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆ సినిమా నిర్మిస్తారట. దీనికి సంబంధించి కరణ్‌ ఇప్పటికే రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారని టాక్‌.

Click Here To Watch NOW

తెలుగుతో పాటు హిందీ, తమిళం రీమక్‌ హక్కులు సైతం ఆయనే కైవసం చేసుకున్నారట. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌తో కలసి ఈ చిత్రాన్ని కరణ్‌ వివిధ భాషల్లో నిర్మిస్తారని చెబుతున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన చిత్రమిది. కేరళలో ఈ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషల వారికి ఈ కథ రిలేటెడ్‌గా ఉంటుందని, అందుకే కరణ్‌ జోహార్‌ ఈ సినిమా రీమేక్‌ హక్కులు తీసుకున్నారట.

దీంతో తెలుగులో ‘హృదయం’ చేయబోయే కుర్ర జంట ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో కనిపిస్తోంది. అక్కడ స్టార్‌ హీరో కొడుకు ఈ సినిమా చేశాడు. ఆ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో స్టార్‌ హీరో తనయులను తీసుకుంటారా? లేక కొత్త వారినే తీసుకుంటారా అనేది చూడాలి. అన్నట్లు ప్రతి లాంగ్వేజ్‌ అక్కడి ప్రముఖ నిర్మాతతో కలసి ఈ సినిమా చేస్తారని టాక్‌ కూడా వినిపిస్తోంది. ఆయా భాషల్లో సినిమా నిర్మాణంలో కరణ్‌కు అనుభవం లేదు. దీంతోనే ఈ నిర్ణయం అంటున్నారు.

ముందు చెప్పుకున్నట్లు ఈ సినిమా కంటే ముందే కరణ్‌ జోహార్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగు వరకు వచ్చేసరికి ముఖ్య నిర్మాత పూరి జగన్నాథ్‌. కాబట్టి ‘హృదయం’ సినిమానే కరణ్‌ తొలి స్ట్రెయిట్‌ తెలుగు సినిమా అనుకోవచ్చు. ఈ సినిమా తర్వాత కూడా కరణ్‌ జోహార్‌ తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్నారని టాక్‌. స్ట్రెయిట్‌ సినిమాలు చేస్తారా? లేక రీమేక్‌లా అనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus