Neha Chowdary: ఈ వీకెండ్ కే పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి !

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ అయిన నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.నేహా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి అని అందరికీ తెలిసిన సంగతే. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో ఈమె జాతీయ స్థాయి ఛాంపియన్ గా నిలిచింది.కానీ ఈమెకు సినిమాలు అంటే బాగా ఇష్టం.

అందుకే ఈ రంగంలో రాణించాలి అనుకుంది. ఈ క్రమంలో బుల్లితెరపై పలు షోలు చేసి బాగా పాపులర్ అయ్యింది. ఈ ఏడాది బిగ్ బాస్-6లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న నేహా చౌదరి.. మొదట స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించింది కానీ.. తర్వాత 4 వారాలకే ఎలిమినేట్ అయ్యింది. సరే నేహా చౌదరి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు అనిల్ అట. ఇతను ఆమె క్లాస్ మేట్ అని తెలుస్తుంది. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు అని తెలుస్తుంది.

పెద్దలను అంగీకారంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు.. ఆమె తన యూట్యూబ్ ఛానల్స్ చాలా వీడియోలు షేర్ చేసింది. ఈ వీకెండ్ కే నేహా పెళ్లి జరుగబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే అందరిలోనూ ఓ ప్రశ్న ఉంది. అదేంటి అంటే.. ‘పెళ్లయ్యాక కూడా నేహా చౌదరి బుల్లితెర పై కనిపిస్తుందా?’ అని..! అందుకు ఆమె కాబోయే భర్త ఏమీ అడ్డు చెప్పలేదట. హ్యాపీగా తన వర్క్ లైఫ్ ను ఎంజాయ్ చేసుకోమని చెప్పినట్టు సమాచారం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus