Prabhas: ప్రభాస్- హను – మైత్రి… క్రేజీ కాంబోకి అంతా రెడీ..కానీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 22 వ సినిమాగా ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ రానుంది. దీని తర్వాత 23 వ సినిమాగా ‘కల్కి 2898 AD’ రానుంది. మరి మారుతి ప్రాజెక్టుని ఇంకా అనౌన్స్ చేయలేదు. లెక్క ప్రకారం అయితే ఇది 24 వ ప్రాజెక్టు అనుకోవాలి. అప్పుడు ప్రభాస్ 25 వ సినిమాగా ‘స్పిరిట్’ అవుతుంది. కానీ ‘స్పిరిట్’ కంటే ముందే ప్రభాస్ 25 వ సినిమా అంటూ ‘మైత్రి’ సంస్థ ముందుకొచ్చింది.

ముందుగా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ఈ ప్రాజెక్టు ఉంటుందని ప్రకటించారు. తర్వాత ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థకి అత్యంత సన్నిహితుడు అయిన కొరటాల శివ పేరు ఎక్కువగా వినిపించింది. ప్రభాస్ తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు కొరటాల శివ. కాబట్టి.. ప్రభాస్ 25 వ సినిమాని ప్రభాస్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు సైతం ఆశపడ్డారు. కానీ కొరటాల ఇప్పుడు ‘దేవర’ ని 2 పార్టులుగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. సరే ఈ గందరగోళాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం.

లెక్క ప్రకారం అయితే మైత్రి వారితో (Prabhas) ప్రభాస్ చేయబోయేది 26 వ ప్రాజెక్టు అవ్వాలి. ఇదిలా పక్కన పెడితే.. ఈ ప్రాజెక్టుని ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని, 2024 సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. హను రాఘవపూడి సినిమాలకి ఎక్కువగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తారు అనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి కూడా ఆయనే సంగీతం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus