అల్లరి నరేష్ కెరీర్ ని మలుపు తిప్పనున్న మహేష్ మూవీ

సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకు కొన్ని చిత్రాలకు కెరీర్ ని మలుపుతిప్పుతాయి. మంచి పేరుని తెచ్చి పెడుతాయి. అప్పటి నుంచి స్క్రీన్ నేమ్.. అసలు పేరుని పక్కన పెట్టేలా చేస్తాయి. అలాగే ఈవీవీ సత్యనారాయణ తనయుడు ఈవీవీ నరేష్ హీరోగా పరిచయమైన సినిమా అల్లరి. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అల్లరి నరేష్ గా పేరు పెట్టుకున్నారు. ఇప్పటివరకు అదే పేరుతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ అతను నటించిన దాదాపు పది సినిమాలకు పైగా వరుసగా ఫెయిల్ అయ్యాయి. దీంతో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారడానికి సై అన్నారు. మహేష్ బాబు 25 వ మూవీలో కీలకరోల్ పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరుగుతోంది. ఈ చిత్రీకరణ బ్రేక్ లోనే అల్లరి నరేష్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు.

ఇందులో అతను మహేష్ మిత్రుడిగా కనిపించబోతున్నారు. ఈ షూటింగ్ ఈనెల 10 వ తేదీ వరకు అక్కడే జరగనుంది. అయితే అల్లరి నరేష్ పుట్టిన రోజు విషెష్ చెబుతూ డైరక్టర్ కొత్త పేరుతో పిలిచారు. “మా రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది. మహేష్ 25వ మూవీ నీకు మరింత మంచి భవిష్యత్తునిస్తుందని ఆశిస్తున్నాం” అని వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. ఇందులో అతని పేరు రవి అని చెప్పకనే చెప్పాడు. ఈ మూవీ హిట్ అయి, ఆ రోల్ కి మంచి పేరు వస్తే అల్లరి నరేష్ కాస్త రవిగానే పిలిపించుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్ రాజు, అశ్విన్ దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus