అల్లరి నరేష్ – మరీ ఇలా అయిపోయాడేంటి…?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్ బాబు 25 వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం లో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం లో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు,పూజా హెగ్దే లకు సంబందించిన లుక్ లు బయటకి వచ్చాయి. కానీ అల్లరి నరేష్ లుక్ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఈ లుక్ ని సీక్రెట్ గా ఉంచుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా అల్లరి నరేష్ కి సంబందించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పిక్ లో అల్లరి నరేష్ చాలా గడ్డంతో కనిపిస్తున్నాడు, ఈ చిత్రంలో అల్లరి నరేష్, మహేష్ స్నేహితుడు.. రవి పాత్రలో కనిపించబోతున్నాడని గతంలో వార్తలొచ్చాయి. అయితే నరేష్ గడ్డంతో ఉన్న ఈ లుక్ ‘మహర్షి’ చిత్రంలోనిదే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ‘మహర్షి’ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ ప్రారంభమైందని.. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫోటోలలో.. అల్లరి నరేష్ గడ్డంతో ఉన్న ఈ పిక్ బయటకి వచ్చింది. మరి నరేష్ గడ్డంతో ఉన్న ఈ లుక్ ‘మహర్షి’ చిత్రంలోనిదా… లేక వేరే సినిమా కోసం నరేష్ ఇలా గడ్డం పెంచాడా..? అనేది తెలియాలంటే.. ‘మహర్షి’ టీజరో.. ట్రైలరో వచ్చేవరకూ.. ఎదురు చూడక తప్పదు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న… ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus