ఆ సీనియర్ డైరెక్టర్ తో అల్లరి నరేష్ సినిమా ?

‘మూడ్ బాలేదు.. అల్లరి నరేష్ సినిమాకి వెళ్ళి కాసేపు కడుపుబ్బా నవ్వుకుని వద్దాం పదరా’… ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు ఇవి. అయితే ఇది ఇప్పుడు కాదు.. అప్పట్లో.. అంటే ‘సుడిగాడు’ సినిమా వచ్చిన రోజుల్లో అన్న మాట. ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన తండ్రి ఇ.వి.వి.సత్య నారాయణ చనిపోయిన దగ్గర్నుండీ నరేష్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని చెప్పాలి. సరైన కథల్ని ఎంచుకోలేకపోతున్నాడు. కామెడీ సినిమాలు తీస్తున్నాడు.. కానీ జనాలకి వెటకారపు కామెడీలా అనిపిస్తుంది. అందులోనూ ఇప్పటి రోజుల్లో కామెడీ కోసం జనాలు థియేటర్ల వరకూ వెళ్ళట్లేదు. ఇంట్లో కూర్చొని ‘జబర్దస్త్’ ‘పటాస్’ షో లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

సో నరేష్ సినిమాలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడెళ్ళిపోతున్నాయో కూడా తెలీని పరిస్థితి. అప్పట్లో ఏడాది కి 5 లేక 6 సినిమాలతో బిజీ గా ఉండే నరేష్ ఇప్పుడు ఒకటి, రెండు ఆఫర్ల తో సరిపెట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ హీరో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో నటించే మరో హీరో ఎవరనేదాని పై ఇంకా క్లారిటీ రాలేదు. చాలా కాలం తరువాత సీనియర్ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి ఈ చిత్రం తో మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నారట. ‘ఎస్వీఆర్ మీడియా’ బ్యానర్ పై అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని, జూన్ నుండి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో కూడా నరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. మే 9 న ఈ చిత్రం విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus