దాదాపు 9 ఏళ్ళ తరువాత కలిసి నటిస్తున్న రవితేజ, అల్లరి నరేష్..?

ఇప్పటి వరకూ ఎన్నో కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు అల్లరి నరేష్. అయితే తన తండ్రి ఈవివి సత్యనారాయణ చనిపోయిన దగ్గర్నుండీ సరైన స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ప్లాపులు వెనుకేసుకుంటూ వచ్చాడు. అయితే అల్లరి నరేష్ కామెడీ హీరో మాత్రమే కాదు మంచి నటుడన్న విషయం మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం ప్రూవ్ చేసింది. ఈ చిత్రంలో రవి పాత్ర నరేష్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడట.

ఈ క్రమంలో రవితేజ, విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘డిస్కో రాజా’ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోకి కూడా అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్ర కోసం అల్లరి నరేష్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. సునీల్ ని ముందుగా ఈ పాత్ర కోసం అనుకున్నప్పటికీ… ఇప్పుడు అల్లరి నరేష్ ని ఫైనల్ చేశారట. 2010 లో ‘శంభో శివ శంభో’ చిత్రంలో కలిసి నటించారు రవితేజ,నరేష్. మళ్ళీ దాదాపు 9 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus