9 ఏళ్లుగా సరైన హిట్టు లేక కిందా మీదా పడుతున్నాడు అల్లరి నరేష్. 2012 లో వచ్చిన ‘సుడిగాడు’ తరువాత నరేష్ ఇప్పటివరకూ మరో హిట్ ను అందుకోలేకపోయాడు. ‘జేమ్స్ బాండ్’ ‘సిల్లీ ఫెలోస్’ చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక ‘మహర్షి’ చిత్రం హిట్ అయినప్పటికీ అది పూర్తిగా మహేష్ బాబు సినిమా. ఇదిలా ఉండగా.. 2021 ఆరంభంలో అయినా హిట్టు అందుకుంటాడనుకుంటే.. ‘బంగారు బుల్లోడు’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని భావించి.. ఫిబ్రవరి 19న ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం
1.00 cr
సీడెడ్
0.30 cr
ఉత్తరాంధ్ర
1.20 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)
2.50 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్
2.70 cr
‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ పెద్ద కష్టం కాదు. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే.. బాగానే రాబట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే పోటీగా మరో 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ రవుతుంది. వీటిని తట్టుకుని నిలబడితే.. వీకెండ్ పూర్తయ్యేసరికి 70శాతం రాబట్టొచ్చు.