Allu Ajrun: సింపుల్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ షర్ట్ ఎన్ని వేలో తెలిస్తే షాకవుతారు..!

అల్లు అర్జున్ ని  (Allu Arjun)  ఇది వరకు స్టైలిష్ స్టార్ అనేవారు. కానీ ‘పుష్ప’ (Pushpa)  తో అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ తగిలించాడు దర్శకుడు సుకుమార్ (Sukumar) . అయితే అతనికి స్టైలిష్ స్టార్ ట్యాగ్ ఇచ్చింది కూడా సుకుమారే అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘ఆర్య’ సినిమాకి స్టైలిష్ స్టార్ ట్యాగ్ ఇచ్చాడు అల్లు అర్జున్ కి..! స్టైలిష్ స్టార్ ట్యాగ్ అయినా.. ఐకాన్ స్టార్ ట్యాగ్ అయినా అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది .

Allu Ajrun

ఎందుకంటే.. అల్లు అర్జున్ స్టైల్ గా ఉండటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అతని డ్రెస్సింగ్ విషయంలో అయినా, హెయిర్ విషయంలో అయినా, కార్, ఆఫీస్.. ఇలా ఏది తీసుకున్నా సరే, చాలా స్టైల్ గా ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల అల్లు అర్జున్ ‘ఆయ్’  (AAY)  సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. ఆ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. పైగా దానికి అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాస్  (Bunny Vasu) నిర్మాత.

అందుకే అల్లు అర్జున్ ఆ టీంని కలవడం జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Ajrun) వేసుకున్న షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. చూడటానికి ఎరుపు రంగులో ఉన్న ఆ షర్ట్.. మధ్యలో ‘కాంతార’ లో హీరో కోలం ఆడుతున్నప్పుడు వేసుకునే గెటప్ స్టైల్లో ఓ బొమ్మ ఉంది. ఇక ఆ షర్ట్ పేరు ‘స్కార్లెట్ క్వీన్ ప్యూర్ ఎకోవేరో’ అని తెలుస్తుంది. ఇక దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 2400 అట. వినడానికే షాకింగా ఉంది కదూ. స్టార్ హీరోల మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ రేంజ్లోనే ఉంటుంది. ఇది జస్ట్ సాంపుల్ మాత్రమే.

‘పుష్ప’ షూటింగ్ కి గడ్డం అడ్డం.. మేకర్స్ ఏం చేసారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus