శివ తత్వం పై సినిమా చూసి, విష్ణు తత్వం మీద సినిమా రావాలని కోరుకున్నాను – అల్లు అరవింద్

మనం ఏదైనా బలంగా కోరుకుంటే, అది మనకు చేరే వరకు ఈ విశ్వమంతా మనకు సహాయపడుతుంది అంటారు. కార్తికేయ-2 చిత్రం విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. సినిమా విడుదల విషయంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, విడుదల తరువాత మాత్రం విజయం పరంపరను ఊహించని రీతిలో కొనసాగిస్తుంది. ఈ చిత్రం బృందం ఎప్పటినుండో మా సినిమాను కృష్ణుడు నడిపిస్తున్నాడు అని చెబుతూ వస్తున్నారు. కార్తికేయ -2 చిత్రం విడుదల తర్వాత ఫలితం చూస్తుంటే ఈ మాట కూడా అక్షరాలా నిజం అనిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కార్తికేయ చిత్రం సత్తాను చాటుతుంది.

తాజాగా కార్తికేయ చిత్రం సక్సెస్ మీట్ లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మాములుగా హిందీలో లో కేవలం 50 థియేటర్లలో రిలీజైన కార్తికేయ సినిమా, రెండో రోజుకు 200 థియేటర్లు, 3 వ రోజుకి 700 థియేటర్లలో ఆ సినిమా ఆడటం ఆనందాన్ని కలిగించే విషయం. అలానే ఈ సినిమాలో సత్తా ఉండటం వలనే ఇలా ఆడిందని చెబుతూ, పుష్ప సినిమాను ఉదహరించారు.

అఖండ సినిమాను చూసినప్పుడు శైవం మీద, శివత్వం మీద అంత స్టేజి కి ఆ సినిమా ఎమోషన్ ను తీసుకెళ్లారు, ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో విష్ణువు బేస్ గా తీసుకుని సినిమా చేస్తారు అని ఉహించి చర్చలు కూడా జరిపాను. అటువంటిది ఒక ఏడాది తిరగకముందే విష్ణు తత్త్వం మీద సినిమా రావడం చాలా బాగుందని చెబుతూ మధ్య మధ్యలో యానిమేషన్ లో చూపిస్తూ మళ్ళీ పిక్చర్ లో తీసుకెళ్లడం బాగుందని చందు మొండేటిని కొనియాడారు అల్లు అరవింద్. సినిమా అంటే అమ్మాయి అబ్బాయి మధ్య రొమేన్స్ మాత్రమే కాకుండా, ఒక అమ్మాయి అబ్బాయి ఒక కాజ్ కోసం పరిగెడితే చాలు మనం కూడా వాళ్ళ వెనుక పరిగెడతాం అనిపించిందని తెలిపారు. ఒక అడ్వెంచర్స్ ఫిలిం కు ఒక పౌరాణిక బేస్ ఇచ్చి మళ్ళీ దానిని కలికాలంలో కి తీసుకొచ్చారు అని అద్భుతమైన విశ్లేషణ చేసారు అల్లు అరవింద్.

కార్తికేయ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందు మొండేటి తన మొదటి చిత్రం తోనే అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా చేసిన కార్తికేయ- 2 చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. మన సంస్కృతిని, మన నమ్మకాల్లో ఉన్న కారణాలను అద్భుతంగా చూపిస్తూ చెప్పుకొచ్చాడు చందు. నీలాల నింగి కింద తేలియాడు భూమిని తనలోనే చూపించడం, పడగ విప్పి మడుగున లేచి సర్ప శేషం ఎక్కి నాట్యమాడి కాలీయుణీ దర్పమణచడం వంటి శ్రీ కృష్ణ లీలలు మనకు తెలిసినవి. కానీ దర్శకుడు చందు మొండేటి శ్రీ కృష్ణుని లీలలను సైన్స్ కి,టెక్నలాజీ కి కలిపి వివరించడం ప్రేక్షకులను కదిలించింది. మనకు కనిపించడం లేదంటే మన కన్ను చూడలేకపోతుందని అని అర్ధం, మనకు కన్ను లేదని కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మం మతం కాదు మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన శ్రీ కృష్ణుడు కంటే గురువు ఎవరు.? లాంటి మాటలు చాలా మందిని ఆలోచింపజేస్తాయి. ఏదేమైనా ఎప్పుడు జరిగేదానిని అనుభవం అంటారు, ఎప్పుడో జరిగేదానిని అద్భుతం అంటారు. చందు మొండేటి తీసిన కార్తికేయ అటువంటి అద్భుతమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus