నాగచైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లోఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘తండేలు’ అని ఇటీవల పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ పదం అర్థం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దీని అర్థం తెలిసే ఉంటుంది. మిగిలిన వాళ్లకు దాని అర్థం తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి కూడా కొన్ని సందేహాలున్నాయి. వీటి గురించి నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఆసక్తికరంగా స్పందించారు.
నాగచైతన్య – సాయిపల్లవి జంటగా ఈ సినిమాలో నటసి్తున్నారు. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ మత్స్యకారుల బృందం చేసిన వీరోచిత చర్యలు కూడా సినిమాలో చూపిస్తారు. ఉత్తరాంధ్ర జాలర్లు గుజరాత్ ప్రాంతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సినిమాలో సినిమాటిక్‌గా చూపిస్తారట. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
వెంకటేశ్, నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘తండేల్’ సినిమా ప్రేక్షకుల్ని విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు.
మామూలుగా ఒక దర్శకుడు హిట్ కొడితే వెంటనే అతడికి వరుస అవకాశాలు వస్తాయి. వాటన్నింటినీ వదులుకుని మాకు తొలుత ఇచ్చిన కమిట్‌మెంట్ కోసం నిలబడేవారు తక్కువమంది ఉంటారు. ‘కార్తికేయ 2’ సినిమా విజయం తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా మా సంస్థతోనే చేయాలనే కమిట్‌మెంట్‌పై చందు మొండేటి నిలబడ్డారు. ఇంకా ఈ సినిమా విషయంలో ఏ డౌట్స్ ఉన్నా త్వరలో అన్నింటినీ క్లియర్ చేస్తాం అని అల్లు అరవింద్ తెలిపారు.
చందూ మొండేటి గురించి (Allu Aravind) అల్లు అరవింద్ చెప్పిన మాటలు సింగిల్ ఇంటెన్షన్‌తో కాకుండా… ఇంకో మాట మనసులో పెట్టుకుని అల్లు అరవింద్ మాట్లాడారు అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఓ దర్శకుడు గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేస్తా అని చెప్పి తర్వాత వేరే బ్యానర్‌కి వెళ్లిపోవడం ఇటీవల మనం చూశాం కూడా.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!