వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు ఎక్కడకి వెళ్లినా వినిపించే తొలి ప్రశ్న.. ‘వారసత్వంతో వచ్చారు.. అందుకే విజయం సాధిస్తున్నారు’. ఇండస్ట్రీలో వాళ్లు ఇంకా ఉన్నారు అంటే.. నెపోటిజమే కారణం అనే రేంజిలో అడుగుతుంటారు. దానికి నెపోటిజంతో వచ్చిన ఒక్కో స్టార్ ఒక్కోలా సమాధానం చెబుతుంటారు. నిజానికి ఇలాంటి పరిస్థితి బాలీవుడ్‌లో ఎక్కువగా ఉంటుంది.. మన దగ్గర తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రశ్న ఆ నటులకు చాలా ఇబ్బంది పెడుతుంటుంది.
అన్ని ఇండస్ట్రీల్లో నెపోటిజం ఉంటుంది… అయినా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడుతుంటారు అంటూ చాలామంది తప్పించుకుంటారు. ఇంకొందరు అయితే నెపోటిజం కేవలం తొలి సినిమాకు మాత్రమే, రెండో సినిమాను మాత్రం సొంతంగా ఆలోచించే వస్తారు అని చెప్పారు. అయితే ఇలాంటి నెపో కిడ్స్ వల్ల అవుట్ సైడర్స్ ఎదగకుండా పోతున్నారు అనే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్నను ‘అన్‌స్టాపబుల్’ షోలో అల్లు అరవింద్‌ను బాలకృష్ణ అడిగారు.
‘‘నెపోటిజంపై నా సమాధానం విషయంలో నన్ను ట్రోల్ చేసినా పర్లేదు. నెపోటిజం అని విమర్శించే వాళ్లు గుండెల మీద చేయి వేసుకొని ఒక విషయం చెప్పాలి. వాళ్లకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఉపయోగించుకునేవారా? లేక ఇది నెపోటిజం అని పక్కకు వెళ్లిపోయేవారా?. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగి ఆ ఇంట్రెస్ట్ ఉండి, టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్న మార్గంలో నడిస్తే తప్పేంటి?’’ అని అల్లు అరవింద్ ప్రశ్నించారు.
దాంతోపాటు తన లాయర స్నేహితుడు గురించి కూడా చెప్పారు. ‘‘నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు లాయర్లు. ఆ తర్వాత ఆయనా అదే వృత్తిలోకి వచ్చారు. జడ్జి అయ్యాడు. తన ఇద్దరు కుమారులలో పెద్దవాడికి నటన అంటే ఆసక్తి ఉండి.. ఆర్టిస్ట్ అయ్యాడు. చిన్నవాడు ఆ వాతావరణంలో పెరగడం వల్ల లాయర్ అయ్యాడు. దాన్ని నెపోటిజం అని విమర్శించలేం కదా. ఇలా ప్రతి రంగంలోనూ వారసులు వస్తున్నారు. దానిని నెపోటిజం అనలేం కదా అని అరవింద్ గట్టిగానే చెప్పారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!